నాకు తెలిసి చాలామంది “కట్రదు తమిళ్” ని ద్వేషించారు, అలాగే “తంగ మీంగల్” ని కూడా చాలా మంది ద్వేషించారు. ఈ రెండింటినీ ద్వేషించినప్పటికీ “తరమణి” ని మాత్రం ప్రేమించారు. ఎందుకు?
ఎందుకంటే “తరమణి” ని తీసిన రామ్ “కట్రదు తమిళ్” “తంగ మీంగల్” తీసినప్పటి కంటే చాలా పరిణితి చెందాడు. “పరిణితి” అనే పదం చాలా సాధారణంగా ఉపయోగించేదే. కానీ ఇక్కడ నేను “పరిణితి” అనే పదానికి బదులు వేరే పదాన్ని వెతకాలనుకున్నాను.ఏ పదం పెట్టాలి? కాస్త ఆలోచించనివ్వండి.
బాగా ఆలోచిస్తే , రామ్ అనే వ్యక్తి నేను,నువ్వు కాదని బాగా అర్థం చేసుకున్నాను. అతను “కట్రదు తమిళ్” చేసినప్పుడు ( అంటే ఆ సినిమా ఆడుతున్న సమయంలో) ఇంటర్వ్యూ లలో ఒకవైపు అబ్దుల్ కలాం ని, గ్లోబలైజేషన్ ని మరో వైపు కమ్యూనిస్టులను బాగా తిట్టాడు. మాములుగా ఒక వ్యక్తి అటు నరేంద్ర మోడీ ని అతని అనుచరులను తిట్టి , మరోవైపు సీతారాం ఏచూరి ని కూడా తిడితే ఏమంటాం ? కాస్త mad అని అంటాం.
ఇంకోవైపు నుంచి రామ్ విరక్తి చెందిన వాడి లాగా అనిపిస్తాడు. ఎవడైతే ఈ ప్రపంచం దేనీ మీద ఆధారపడలేదు అని కనుగొంటాడో వాడిలా. “అంగడి తేరు” సినిమాలో జిగేలుమనే శరవణ స్టోర్స్ వెనక వుండే చెరసాల వంటి జీవితాన్ని వదిలించుకొని వేరే జీవితాన్ని గడపడానికి ప్రయత్నించిన “లింగు” లా. అంటే ఒక జీవితం తప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి ,కష్టమైనప్పటికీ మరో జీవితం లోకి అడుగుపెట్టడం.
రామ్ మనసు చాలా ఆందోళనలతో నిండిపోయింది. ఈ ప్రపంచంలోని చాలా విషయాలపై అతనికి కోపం. అందుకే తనకు తానుగా సిటీ అంతా తిరగడం, బీచ్ ఇసుకలో ప్రేమించే జంటలను వేటాడటం,చిల్లర ఇవ్వలేదని రైల్వే ఉద్యోగిని చంపడం,అమ్మాయి వక్షోజాలను నొక్కడం. ఇవన్నీ టచ్ చేయడానికి ఎవరు ధైర్యం చేయగలరు? ఒక్క రామ్ తప్ప. క్లుప్తం గా చెప్పాలంటే, తను సొంత ప్రపంచం లో ఏం చేయదలుచుకున్నాడో, అది తన కథానాయకుడి ద్వారా చేశాడు.
“తంగ మీంగల్” రామ్ యొక్క 2 వ చిత్రం. “కట్రదు తమిళ్” కి సీక్వెల్ మాదిరి వుంటుంది. రామ్ ఈ సారి ప్రభాకర్ ద్వారా కాకుండా , కల్యాణి ద్వారా మనకు కనపడుతాడు. కూతురి చదువుకి ఫీజు కట్టలేని తండ్రి పట్ల సానుభూతి చూపాలనుకున్నాడు. అలాగే డబ్బు కోసం ఒక ఫారినర్ తో కలసి పురాతన ఆయుధం కోసం వెతికే ఒక లోఫర్ పట్ల కూడా సానుభూతి చూపాలనుకున్నాడు. తను కోపం తో, madness తో ఏదైతే చేశాడో వాటి మీద మీరూ సానుభూతి చూపించాలనుకున్నాడు.
రామ్ mad కావచ్చు, కానీ నిజాయితీ లేని వాడు కాదు.తను ఏదైతే నమ్ముతున్నాడో అదే చెబుతున్నాడు. అతను శంకర్ లా, “శివాజీ” లో తమిళ సంసృతిని, అమ్మాయిల వేషధారణను పొగిడి ,మళ్ళీ ఎటువంటి సంకోచాలు లేకుండా అదే అమ్మాయిని “వాజీ- వాజీ “ పాటలో సెమిన్యూడ్ డ్యాన్స్ చేయడాన్ని అంగీకరించే రకం కాదు.
రామ్ నిజాయితీపరుడు,సిన్సియర్ కానీ mad. అతని సినిమాలను అభినందించాలంటే అతని madness ని ఎంతో కొంత అర్థం చేసుకొని వుండాలి. కనీసం అతని సినిమా చూస్తున్నంత సేపైనా మిమ్మల్ని మీరు “mad” గా ఉంచుకోండి.అతను బ్రతకుతెరువు కోసం మాత్రమే ఫిల్మ్ మేకర్ కాలేదు. అతనికి సన్నివేశాలు ఎలా రాయాలి, వాటిని ఎలా తీయాలి బాగా తెలుసు.మొత్తానికి ఒక సినిమా ఎలా తీయాలి అనేది అతనికి బాగా తెలుసు. ఒక ఆడియన్స్ గా మీరు బాక్సాఫీస్ వద్ద 120 రూపాయలు చెల్లించి సినిమా హాల్ లోకి ఎంటర్ అయ్యాక, మీకున్న మీ శాస్త్రీయ,హేతువాద నరాన్ని 180 నిముషాలు వదిలేస్తె, రామ్ అతని వెచ్చని,అద్వితీయమైన వెర్రితనాన్ని(madness) మీకు అందిస్తాడు. ఈ విధంగా చూపగల తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరూ లేరు. బాలా కూడా దరిదాపుల్లోకి రాలేడు.
“తరమణి” అనేది రామ్ తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాల తర్వాత అతని లో ఒక చెప్పుకోదగిన చేంజ్. కానీ, ఇది ఒక చిన్న చేంజ్ మాత్రమే. ఇప్పుడు అతను షార్ట్ స్కర్ట్స్ వేసుకున్న ఆడవాళ్ళను ను గౌరవిస్తాడు.పబ్ లకి వెళ్ళే ఆడవాళ్ళను కూడా గౌరవిస్తాడు. అలాగే క్షణికమైన ఆవేశాల కోసం “నీతి” (మోరల్స్) తప్పే ఆడవాళ్ళను కూడా క్షమిస్తాడు.
అంటే , రామ్ మారిపోయాడా? ఇంకా సూటిగా చెప్పాలంటే ,రామ్ తన madness ని నయం చేసుకున్నాడా ?. “అతను షార్ట్ స్కర్ట్స్ వేసుకున్న ఆడవాళ్ళను గౌరవిస్తాడు” అంటే దీని అర్థం తను గౌతం మీనన్ అయ్యాడని కాదు. షార్ట్ స్కర్ట్స్ వేసుకున్న ఆడవాళ్ళు ,ఇప్పటికీ అతనికి “షార్ట్ స్కర్ట్స్ వేసుకున్న ఆడవాళ్ళు” మాత్రమే. వాళ్ళు తన ప్రపంచం లోని ఆడవాళ్ళతో సమానం కాదు. ఫైనల్ గా, తనకు తాను ( ప్రభునాథ్ is రామ్ in తరమణి) ఈ క్రింది ప్రశ్నలు అడగకుండా ఉండలేకపోతాడు. ఆడవాళ్ళు మగవాళ్ళను ను పబ్లిక్ గా హగ్ చేసుకుంటే అతను అసౌకర్యం గా ఫీల్ అవుతాడు. అంటే, దీని అర్థం అతను “కట్రదు తమిళ్” లో మాదిరిగా గన్ తో చంపుతాడు అని కాదు. అతను కేవలం ఆ ఒక్క విషయానికి మాత్రమే అసౌకర్యం గా వున్నాడు అని అర్థం. అతనికి ఒక వివరణ కావాలి. ఒక వివరణ ఇచ్చినప్పటికీ కూడా అతనికి ఇంకా కోపం ,mad. ఏదైతో నిజమో, దానితో మాత్రమే శాంతి పొందుతాడు. ఇంకా రామ్ తన madness తో శాంతిని నిర్మించాడు కూడా.
కాబట్టి, చాలా మంది “కట్రదు తమిళ్” “తంగ మీంగల్” రెండింటినీ ద్వేషించినప్పటికీ “తరమణి” ని మాత్రం ప్రేమించారు. ఎందుకంటే, రామ్ చివరికి తనకు mad వున్నదని గుర్తించాడు. అతని లో వున్న నయం చేయలేని ఆ madness కి ,అతని సినిమాలు సమాధానాలుగా మారాయి. ప్రజలు తన madness కి సానుభూతి చూపాలని అతను కోరుకున్నాడు, అలాగే మీ నుండి ఆ చిన్న సానుభూతి కోసం మీ గుడిలో గన్ పట్టుకోవలసిన అవసరం లేదని కూడా తెలుసుకున్నాడు . చక్కని మాటలతో రాసే ఒక సమాధాన లేఖ కూడా ఆ పని చేయగలదని ఇప్పుడు అతనికి తెలుసు.
This article was written by G Waugh.
తెలుగు స్వేచ్ఛానువాదం: దత్తు
(“కట్రదు తమిళ్” ను “డేర్” అని, “తరమణి” ని అదే పేరు తో తెలుగు లోకి డబ్ చేశారు. “అంగడి తెరు” ని “షాపింగ్ మాల్” పేరు తో డబ్ చేశారు).